24, ఆగస్టు 2014, ఆదివారం

ఏం సందేహం లేదు ...ఈ పాట చాలా బాగుంది  ...

చాలా రోజుల తర్వాత మళ్ళీ పలకరిస్తున్నాను నా పూలవానని,ఇన్నాళ్ళు ఏమైపోయావ్ అంటే చెప్పడానికి చాలా కారణాలు దొరకచ్చు కానీ నిజాయితీగా ఒప్పుకొవాలంటే నా బద్దకమే అసలైన  కారణం ,దానిగురించి రాయాలంటే ఎన్ని టపాలైనా సరిపోవు.ఈ ఒక్కసారికి క్షమించేయండి...:) 

సంగీతాన్ని ,సాహిత్యాన్ని గురించి వ్యాఖ్యానించగలిగే పరిజ్ఞానం ,అనుభవం రెండు నాకు లేవు కాని ఆస్వాదించగలిగే ,ఆనదించగలిగే అలవాటు మాత్రం ఉంది.నా వరకు సంగీతం అంటే మనసుతో మనం మాట్లాడే భాష ,మౌనం మెలకువలోకి చేసే ప్రయాణం. కనులు మూసిన చీకటి వాకిట్లో విరిసే వేకువ నవ్వే పాట.చెవుల్లోంచి మనసులోకి ఒంపుకునే అమృతం సంగీతం.  పాట నీతొ  మట్లాడుతుంది,నీ మనసుని తాకుతుంది ,పదే పదే వెంటాడుతుంది . గత కొన్ని రోజులుగా నన్ను వెంటాడుతున్న అలాంటి  ఒక మంచి పాట గురించి అందరితో పంచుకోవాలని ఈ టపా రాస్తున్నాను.

చిత్రం         :      ఊహలు గుసగుసలాడే 
సంగీతం     :      కల్యాణి కోడూరి
సాహిత్యం   :      అనంత్ శ్రీరాం 
గానం         :      సునీత, కల్యాణి కోడూరి

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది  
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది  
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది 
నిమిషము నేల మీద నిలవని కాలిలాగ
మది నిను చెరుతొందే చిలకా 
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది 
హృదయము రాసుకున్న లేఖా.... 
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది  
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది 

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే   
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే  
నా కళ్ళళ్ళోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే 
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటూ 
మది నిను చేరుతుందే చిలకా 
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా.... 
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే   
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే  

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా   
ఏమౌతున్నా గానీ ఏమైనా అయిపొనీ ఏం పర్వాలేదన్నావా  
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక 
సతమతమైన గుండె గనుకా 
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా.....
హ్మ్మ్... హ్మ్మ్.. హ్మ్మ్... హ్మ్మ్.. 
హ్మ్మ్... హ్మ్మ్.. హ్మ్మ్... హ్మ్మ్..

సినిమా నేనింకా  చూడలేదు కాని ఈ పాట విన్న తర్వాత మాత్రం చూడాలనిపిస్తుంది అంత నచ్చేసిందీ పాట.అనంత్ శ్రీరాం సాహిత్యం ,సునీత ,కల్యాణి కోడూరి గానం అన్నీ కలిసి ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసాయి. చక్కని భావం ,పొందికైన పదాల అమరిక,తియ్యని గొంతు ,అన్నిటికి మించి సాహిత్యాన్ని మింగేయని సంగీతం మొత్తానికి మంచి పాట విన్నామన్న అనుభూతినిస్తుంది .

గుసగుసలు మీరు కూడా వినేయండి ఒకసారి


  
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి